పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది: భన్వర్‌లాల్

హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో పోలింగ్‌కు ఎక్కడా అంతరాయం లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటివరకు 54 శాతం వరకు పోలింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు.