రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎస్ మహంతి

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి రేపు హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రత్యూష్‌సిన్హా కమిటీతో మహంతి భేటీ కానున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల పంపకాలపై చర్చించనున్నారు. బ్యూరోక్రాట్ల విభజనపై మహంతికి డ్రాఫ్టుల నివేదికను సబ్‌కమిటీ చైర్మన్ ఎం. శ్యామూల్ అందజేశారు.