అపాయింటెడ్ డేపై పరిశీలించండి
హైకోర్టు సూచనను కేంద్ర హోం శాఖకు కేకే నివేదన
న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉనికిలోకి వచ్చే తేదీపై పరిశీలించాలని కేంద్ర ¬ంశాఖ కార్యదర్శిని టీఆర్‌ఎస్ నేతలు కోరారు. బుధవారం సాయంత్రం ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు, వినోద్, జగదీశ్వర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా అపాయింటెడ్ డే జూన్ 2 నుంచి ముందుకు జరపాలని ¬ంశాఖ కార్యదర్శిని టీఆర్‌ఎస్ నేతలు కోరారు. అపాయింటెడ్ డేను ముం దుకు జరపాలని హైకోర్టు సూచనలను ¬ంశాఖ కార్యదర్శికి టీఆర్‌ఎస్ నేత లు వివరించారు. ఇప్పటికే కేంద్రం జూన్ రెండుగా దీనిని నిర్ణయించింది. ఎన్నికలు బుధవారంతో ముగియగా, 16న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినా మరో పక్షం రోజులు గడువు ఉంటుంది. ఇలాంట ప్పుడు పాలనకు ఇబ్బంది కాగలదు. దీంతో తెలంగాణ రాష్ట్ర
ఆవిర్భావ తేదీ ‘అపాయింటెడ్ డే’పై పునఃసవిూక్షించాలని కోరరాఉ. ఈ మేరకు హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. శాసనసభకు సంబంధించిన ఫలితాలు మే 16న వెలువడనున్న నేపథ్యంలో మే 16ను అపాయింటేడ్ డేగా పరిగణించాలన్న టీఆర్‌ఎస్ విజ్ఞప్తికి న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. 17 తర్వాత ప్రభుత్వం ఏర్పాటవుతున్న తరుణంలో జూన్ 2 వరకు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని కేంద్రానికి సూచించింది. అపాయింటేడ్ డే జూన్ 2న కాకుండా మే 16వ తేదీగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ టీఆర్‌ఎస్ నేత జగదీశ్వర్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ జూన్ 2న కాకుండా మే 16వ తేదీగా ప్రకటించాలని కోరారు. మే 16న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని, మే 17 నుంచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడుతుందని వివరించారు. ఫలితాలు వెలువడిన తర్వాత మే 17 నుంచి జూన్ 2 మధ్య కాలంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని తెలిపారు. ఏకకాలంలో ప్రభుత్వం, రాష్ట్రపతి పాలన కొనసాగజాలవని, అది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2న అపాయింటేడ్ డే ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదని తెలిపారు. మే 16న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. దాంతోనే రెండు రాష్ట్రాలు ఏర్పాటు జరిగినట్లు భావించాలని తెలిపారు. జూన్ 2 అపాయింటెడ్ డేగా ఉంటే రాజ్యాంగ సంక్షోభం తప్పదన్నారు. ఈ నేపథ్యంలో అపాయింటేడ్ డేను ముందుకు జరపాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. పిటిషనర్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు అంశాన్ని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇవే విషయాలను వారు కేంద్ర ¬ంశాఖకు నివేదించారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కెేశవరావు తెలిపారు.