కేరళలో అల్పపీడన ద్రోణి
తెలంగాణలో
భారీగా వర్షాలు
హైదరాబాద్, మే 8 (జనంసాక్షి) :కేరళ సముద్ర తీరం వ ద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం నాడు గోవా సముద్ర తీరం వద్ద అల్పపీడన ద్రోణి వాయుగుం డం మారే అవకాశం ఉందని, దీంతో తమిళనాడు, దక్షిణతీర పరిసరాల ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసా గుతు న్నదని తెలిపారు. దీని ప్రభావం వల్ల తమిళనాడు, కర్ణాటక మీదుగా మధ్యప్రదేశ్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశంలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారంనాడు ఉత్తరకోస్తా, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండలలో వర్షాలు పడే అవకాశంఉంది. అల్పపీడన ప్రభావంతో గురువారం నగరంలో అక్కడక్కడ భారీగా వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల జల్లులు పడ్డాయి.రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి వల్ల రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కురిసన అకాల వర్షాల వల్ల తెలంగాణ ప్రాంతంలో వరి పంట నేల వాలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే మామిడి, తదితర పండ్ల తోటలు కూడా దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు కూలి సంఘం నేత వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం మార్కెట్‌కు వస్తే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.