ఒత్తిళ్లకు తలొగ్గం


విధి నిర్వహణలో భయపడం
: సీఈసీ సంపత్‌
న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :ఎన్నికల నిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గ బోమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్‌ సంపత్‌ అన్నారు. గురు వారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక ల నిర్వహణలో ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలు బాధాకరమన్నారు. ఈసీపై ఒక జాతీయ పార్టీ నిరసన వ్యక్తం చేయడంపై ఆయన స్పందించారు. చిన్నచిన్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులను బదిలీ చేయలేమని సంపద్‌ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినప్పుడు నాయకులు పరిపక్వతతో ఆలోచించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఇప్పటి వరకు ఎలాంటి పొరపాటూ జర గలేదని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల
పోలింగ్‌ సజావుగా సాగుతోందని ఆయన తెలిపారు. తమ విధి నిర్వహణలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. ధైర్యంగా, నిజాయితీగా తమ పని తాము చేసుకుపోతున్నామని ఆయన పేర్కొన్నారు.