ప్రజలకు దూరమయ్యాం
పరాజయ పాలయ్యం
నింద మోపడంలో విపక్షాలు సఫలం
ఓటమిని అంగీకరించిన రఘువీరా
హైదరాబాద్, మే 12
(జనంసాక్షి):
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంధిరాభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు రేపు వెలుబడబోయే ఫలితాల్లో పునరావృతం కావని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉందని అన్నారు. రాష్ట్ర విభజన ప్రభావం తమ పార్టీపై ఉన్నప్పటికీ దీనిని త్వరలో అధిగమించి ప్రజల్లో విశ్వాసాన్ని పొందుతామని అన్నారు. సీమాంధ్ర అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్రను పోషించనుందని అన్నారు. మధ్యాహ్నానికి వెలుడిన ఫలితాల ప్రకారం సీమాంధ్రలో 92 మున్సిపాలిటీలకు గాను 62 స్థానాల్లో టీడీపీ, 7 కార్పొరేషన్లగాను 5 స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకుని అగ్రభాగంలో నిలిచింది. కాగా కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలిచింది.