పల్లె తీర్పు విలక్షణం


ఉత్తర తెలంగాణలో కారు
దక్షిణ తెలంగాణలో హస్తం హవా
టీడీపీకి చావు దెబ్బ.. ఖమ్మంలో ఉనికి
ఎంపీటీసీల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం
జెడ్పీటీసీల్లో తెరాస గాలి
కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌
జెడ్పీ పీఠాలు తెరాస కైవసం
హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) :
పల్లె ఓటరు విలక్షణమైన తీర్పునిచ్చాడు. ఉత్తర తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ఓటర్లు దక్షిణ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కే అండగా నిలిచారు. ఇక తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాం తంతో వ్యవహరించిన టీడీపీ మాత్రం చావుదెబ్బతింది. సెటిలర్లు ఎ క్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం తన ఉనికిని చాటుకుంది. క రీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికంగా కాంగ్రెస్‌కు వ చ్చిన జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ గాలి కనిపించింది. ముని సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్‌.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీఆర్‌ఎస్‌ తనకు పట్టున్న ఉత్తర తెలం గాణలో సత్తా చాటింది. ‘పట్టణ’ పరుగులో వెనుకబడిన కారు.. ‘గ్రా మీణ’ పోటీలో దూసుకుపోయింది. ఎంపీటీసీల్లో కొంచం తగ్గినా.. జ డ్పీటీసీల్లో మాత్రం ముందుంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీం న గర్‌, వరంగల్‌ జిల్లాల్లో కారు వేగం పుంజుకుంది. ఇక నల్లగొండ, మె దక్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రభావం చూపని తెలుగుదే శం పార్టీ స్థానిక సంస్థల్లో మాత్రం పుంజుకొంది. రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సైకిల్‌ జోరందుకుంది. మూడు జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించింది. కొన్నిచోట్ల బీజేపీ, ఎంఐఎం కూడా తమ ప్రభావాన్ని చూపించాయి.
తెలంగాణలోని 443 జడ్పీటీసీ, 6480 ఎంపీటీసీలకు గత నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 69 స్థానాలు ఏక గ్రీవమయ్యాయి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు ముగిసిన అనంతరం మంగళవారం కౌంటింగ్‌
నిర్వహించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ కొద్దిగా ముందుంది. 2,259 ఎంపీటీసీలు సాధించి మొదటి స్థానంలో.. టీఆర్‌ఎస్‌ కూడా జోరు మీద ఉంది. ఆ పార్టీకి 1,846 ఎంపీటీసీలు గెలుచుకొని తర్వాతి స్థానాన్ని సాధించింది. టీడీపీ- 1010, వామపక్షాలు – 226, ఇతరులు – 938 చోట్ల గెలుపొందారు. జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 179, కాంగ్రెస్‌ 153, టీడీపీ 42, వామపక్షాలు 3, ఇతరులు 14 చోట్ల గెలుపొందారు. ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ 39, కాంగ్రెస్‌ 9, కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ 33, కాంగ్రెస్‌ 14, వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 13, ఖమ్మం జిల్లాలో టీడీపీ 18, కాంగ్రెస్‌ 9, నల్గొండలో టీఆర్‌ఎస్‌ 12, కాంగ్రెస్‌ 33, నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ 24, కాంగ్రెస్‌ 12, మెదక్‌లో టీఆర్‌ఎస్‌ 20, కాంగ్రెస్‌ 21, రంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ 10, కాంగ్రెస్‌ 13, మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ 21, కాంగ్రెస్‌ 29 స్థానాల్లో విజయం సాధించాయి.
కౌంటింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే కారు ఆధిక్యంలో దూసుకుపోయింది. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికి ఊపందుకోవడంతో ఫలితాల్లోనూ గణనీయ మార్పులు వచ్చాయి. అప్పటిదాకా టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ల మధ్య ఉన్న అంతరం తగ్గుతూ వచ్చింది. మధ్యాహ్నం దాటిన తర్వాత హస్తం జోరు పెంచింది. టీఆర్‌ఎస్‌ను వెనక్కు నెట్టి ఆ పార్టీ ముందుకు దూసుకెళ్లింది. జడ్పీటీసీల కౌంటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, ఫలితాలు వెల్లడైన మొదట్లో గులాబీ జెండా రెపరెపలాడింది.
నిజామాబాద్‌లో కారు జోరు..
నిజామాబాద్‌ జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 583 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 239 స్థానాలు దక్కించుకుంది. తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ 228, టీడీపీ 31, ఇతరులు 82స్థానాలను కైవసం చేసుకున్నారు. 36 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. కౌంటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. మాక్లూరు, లింగంపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌ జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ తన ప్రాభవాన్ని నిలుపుకోగా.. బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించింది.
కరీంనగర్‌లో కారు హవా..
కరీంనగర్‌ జిల్లాలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల్లోనూ జోరు కొనసాగించింది. 57 జడ్పీటీసీలకు, 817 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా.. టీఆర్‌ఎస్‌ మరోమారు తన ఆధిక్యాన్ని చాటుకుంది. 349 ఎంపీటీసీలను కైవసం చేసుకొని మొదటి స్థానం దక్కించుకుంది. తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ 280, టీడీపీ 33, ఇతరులు 150 చోట్ల విజయం సాధించారు. వేములవాడ, కోరుట్ల, కరీంనగర్‌, సిరిసిల్ల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటుకుంది. కోనారావుపేట జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకొని టీఆర్‌ఎస్‌ బోణి కొట్టింది
ఆదిలాబాద్‌..
ఆదిలాబాద్‌ జిల్లాలోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటుకుంది. జిల్లాలో 52 జడ్పీటీసీ, మొత్తం 636 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 292 ఎంపీటీసీ స్థానాలనుగెలుపొందిన టీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో నిలించింది. కాంగ్రెస్‌ 163, టీడీపీ 64, ఇతరులు 109 చోట్ల విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ ఐదు జడ్పీటీసీ స్థానాలను, కాంగ్రెస్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖానాపూర్‌లో టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగా.. బోథ్‌, ఇచ్చోడ, ఆదిలాబాద్‌, ముధోల్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పట్టు నిలుపుకొంది. కాంగ్రెస్‌ కూడా అన్ని నియోజకవర్గాల్లో మెరుగైన ప్రదర్శను కొనసాగించింది.
ఖమ్మం జిల్లాలో సైకిల్‌ జోరు..
ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగించింది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఆధిక్యం చాటుకున్న టీడీపీ.. పల్లె పోరులోనూ సత్తా చాటుకుంది. జిల్లాలోని 44 జడ్పీటీసీలు, 625 ఎంపీటీసీలకు గత నెలలో ఎన్నికలు నిర్వహించారు. టీడీపీ 221 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకొని ముందంజలో నిలిచింది. కాంగ్రెస్‌ 86, వామపక్షాలు 112, ఇతరులు 141 చోట్ల గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ కేవలం ఒక స్థానానికి పరిమితమైంది. ఖమ్మం, పాలెరు, వైరా, పినపాక, భద్రాచలం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ, వామపక్షాలు సత్తా చాటాయి. మునుగోడు, ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రభావం చూపింది.
పాలమూరులో కాంగ్రెస్‌ ప్రభ
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 64 జడ్పీటీసీ, 980 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ తన ప్రాభవాన్ని మరోమారు చాటుకుంది. 365 ఎంపీటీసీలు దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. టీఆర్‌ఎస్‌ 297, టీడీపీ 127, ఇతరులు 126 చోట్ల గెలుపొందారు. షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పట్టు నిలుపుకొంది. కొడంగల్‌, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌, టీడీపీ మంచి ప్రదర్శన కనబరిచాయి..గద్వాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్‌ శ్రేణులు నిరుత్సహాంలో ఉన్నారు. గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు గానూ.. మూడు మండలాల్లో కారు జోరు విూద ఉంది. గట్టు మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్విప్‌ చేసింది. ధరూర్‌ మండలంలో 2 స్థానాలను కారు కైవసం చేసుకోగా మరో 5 స్థానాల్లో ముందంజలో ఉంది. మల్దకల్‌ మండలంలో 6 స్థానాలను తన ఖాతాలో వేసుకోనగా, ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గద్వాల మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది.
మెదక్‌..
మెదక్‌ జిల్లాలోని 46 జడ్పీటీసీ, 685 ఎంపీటీసీలు ఉండగా.. కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెలుపొంది మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ 286 స్థానాలతో ముందంజలో ఉంది. సంగారెడ్డి, ఆందోలు, మెదక్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. టీఆర్‌ఎస్‌ 216, టీడీపీ 100, ఇతరులు 59 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకున్నారు. సిద్ధిపేట, గజ్వేల్‌, రామాయంపేట నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని దేవమ్మ 1056 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ పోటీ ఏకపక్షంగా సాగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 1170 ఓట్లు రాగా, సమీప బీజేపీ అభ్యర్థికి కేవలం 114 ఓట్లు మాత్రమే దక్కాయి.
రంగారెడ్డిలో పోటాపోటీ..
రంగారెడ్డి జిల్లాలో ¬రా¬రీ పోరు నెలకొంది. జిల్లాలోని 33 జడ్పీటీసీ, 614 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. అయితే, ఫలితాల్లో అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రభావాన్ని చూపగలిగాయి. కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించగా.. టీఆర్‌ఎస్‌, టీడీపీల మధ్య పోటాపోటీ నెలకొంది. ఇక, ఎంఐఎం కూడా తన ఉనికిని చాటింది. అలాగే, కొత్తపేట మండలంలోనూ ఆ పార్టీ సత్తా చాటింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్‌ 221 సీట్లు దక్కించుకొని ఆధిక్యం ప్రదర్శించింది. టీడీపీ 127, టీఆర్‌ఎస్‌ 143 స్థానాలు దక్కించుకొన్నాయి. వామపక్షాలు ఏడు చోట్ల, ఇతరులు 126 చోట్ల గెలుపొందారు. పరిగి, తాండూరు, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌, తాండూరు, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో టీడీపీ, చేవెళ్ల, వికారాబాద్‌, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పట్టు చాటుకున్నాయి.
నల్లగొండ..
నల్గొండ జిల్లాలోని 59 జడ్పీటీసీ, 835 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 18 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీ వమయ్యాయి. 819 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్‌ 391, టీఆర్‌ఎస్‌ 111, టీడీపీ 148, వామపక్షాలు 78, ఇతరులు 104 చోట్ల విజయం సాధించారు. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, దేవరకొండ, నల్లగొండ, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ముందంజలో నిలిచింది. ఆలేరులో టీఆర్‌ఎస్‌, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో వామపక్షాలు ఆధిక్యత చాటుకున్నాయి.
వరంగల్‌..
జిల్లాలో కాంగ్రెస్‌ సత్తా చాటింది. 50 జడ్పీటీసీ, 705 ఎంపీటీసీలకు గాను.. అత్యధిక సీట్లు దక్కించుకొని ముందంజలో నిలిచింది. కాంగ్రెస్‌ 239, టీఆర్‌ఎస్‌ 199 ఎంపీటీసీలు గెలుపొందగా.. టీడీపీ 221 చోట్ల గెలుపొందాయి. నర్సంపేట, జనగామ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్రం ప్రదర్శించగా, పరకాల, మహబూబాబాద్‌, భూపాలపల్లి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. హన్మకొండ జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.