ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే : సోనియా

న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) :ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట ములు సహజమేనని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఈ ఘోర పరా జయానికి బాధ్యత తానే వహిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సాధా రణమన్నారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. సార్వ త్రిక ఎన్నికలలలో ఓటమి అనంతరం శుక్ర వారం సాయంత్రం ఆమె తన కుమారుడు, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి విూడియాతో మాట్లాడారు. ఓటర్ల నిర్ణయాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నామని, అయితే కాంగ్రెస్‌ తన ఆదర్శాల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ఆమె చెప్పారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడపే ప్రభు త్వం దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఆశిస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు. గెలుపు ఓటములు ప్రజాస్వా మ్యంలో భాగమేనని, ప్రజల నిర్ణయాన్ని తాము సగౌరవంగా అంగీకరిస్తున్నామని అ న్నారు. తమకు ఎలాంటి తీర్పు ఎదురైనా కార్యకర్తలందరికీ ధన్యవాదాలని తెలిపారు. ప్రజలు తమ పార్టీకి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పారన్నారు. ప్రజాభిప్రాయాన్ని శిరసావహిస్తున్నామ న్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని పేర్కొన్న ఆమె నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. విశేష ఆధిక్యం తో గెలుపొందిన కొత్త ప్రభుత్వానికి తన అభినందనలు తెలిపారు. సోనియాతో పాటు ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా కొత్త ప్రభుత్వాన్ని అభినందించారు. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని రాహుల్‌ గాంధి ప్రకటించారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలలో కొన్ని లక్ష్యాలను పెట్టుకుని బరిలోకి దిగామని, ఆ లక్ష్యసాధనకే కృషి చేశామని రాహుల్‌ అన్నారు. నీతి నియమాలకు లోబడి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి కృషి చేశామని సోనియా వ్యాఖ్యానించారు.