కుమారుడికి ఎంసెట్ పరీక్ష ప్రమాదంలో తండ్రి మృతి
కుమారుడిని ఎంసెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
నల్గొండ, మే 22 : జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమీపంలో విషాదం నెలకొంది. ఎంసెట్ పరీక్ష కోసం కుమారుడిని బైక్‌పై తీసుకుళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందారు. భువనగిరికి చెందిన ఉదయ్ ఎంసెట్ పరీక్ష రాసేందుకు తండ్రి రాఘవేంద్రతో కలిసి బైక్‌పై వెళ్తుండగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో కుమారుడు తీవ్రంగా విలపించాడు. పుట్టెడు దుఃఖంతోనే ఉదయ్ ఎంసెట్ పరీక్షకు హాజరయ్యాడు.