మీడియా ఎదుట కొనపూరి రాములు హత్యకేసు నిందితులు
నల్గొండ, మే 22 : కొనపూరి రాములు హత్యకేసు నిందితులను గురువారం పోలీసులు మీడియా ఎదటు ప్రవేశపెట్టారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు ఉండగా ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు ఎస్పీ ప్రభాకర్‌రావుతెలిపారు. రాములు హత్యకేసులో ఏ1 నయీం అని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని ఎస్పీ చెప్పారు. నిందుతులు రియాజ్, యాదగిరిలను నల్గొండలో అరెస్ట్ చేయగా, సురేష్, కుమారస్వామి, రమేష్, ఎల్లేష్, రవి, సోమయ్యను కేరళలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11న రాములు హత్య జరిగిన విషయం తెలిసిందే.