దిగివస్తున్న పసిడి ధరలు

హైదరాబాద్, మే 23 : బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 28,500, 22 క్యారెట్ల బంగారం ధర 26,600 పడిపోయింది. వారం రోజుల్లో తులం బంగారం ధర రెండువేలు తగ్గింది. అటు వెండి ధర సైతం తగ్గుముఖం పడుతోంది. కిలో వెండి ధర రూ.41,250గా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలను ఎత్తివేయడం, రూపాయి మారకం విలువ బలపడటం అలాగే మోదీ నేతృత్వంలో సుస్థిర పాలన ఏర్పాటు కానుండం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.