ఢిల్లీ జమా మసీదులోనవాజ్ షరీఫ్ ప్రార్థనలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఢిల్లీలోని జమా మసీదులో ప్రార్థనలు జరిపారు. ఆసియాలోనే ప్రముఖమైన ఈ మసీదుకు పాకిస్థాన్ ప్రతినిధి బందంతోపాటు షరీఫ్ ఇవాళ వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మొఘలుల పాలనకు దర్పంపట్టే ఎర్రకోటను సందర్శించి ముగ్ధులయ్యారు. నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు షరీఫ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.