ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కుర్జాయ్‌తో నరేంద్ర మోదీ భేటీ

న్యూఢిల్లీ, మే 27 : ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్ హౌస్‌లో పలు దేశాధినేతలతో మోదీ వరుసగా భేటీ అవననున్నారు. మంగళవారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో మోదీ సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం 12:10 గంటలకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మోదీ భేటీ కానున్నారు.