పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు ఉండవు : ప్రకాష్ జవదేకర్
న్యూఢిల్లీ, మే 28 : పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం కృష్ణా, గోదావరి నదులను కలిపినట్టు అవుతుందన్నారు. ఎక్కువ నీళ్లు వృథా కాకుండా లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చని వివరించారు. త్వరలో తెలంగాణకు కూడా కేబినెట్‌లో ప్రాతినిథ్యం ఉంటుందని ప్రకాష్ జవదేకర్ చెప్పారు.