తెలంగాణ తొలిగవర్నర్‌గా నరసింహన్‌

narasimhan

జూన్‌ 2న రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు నిర్ణయం

న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్‌ నర సింహన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నర్‌గా కొనసాగుతున్న ఆయనకు తెలంగాణ బాధ్యతలు అధనంగా కేటాయిం చా రు. ఈమేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఉత్త ర్వు లు వెలువడ్డాయి. అలాగే కొత్తగా ఏర్పడ బోయే తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ రెండో తేదీన రాష్ట్ర పతి పాలన ఎత్తివేస్తున్నారు. అవశేష ఆంద్ర óప్రద ేశ్‌లో మాత్రం మరికొన్ని

రోజుల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ టీఆర్‌ఎస్‌, సీమాంధ్రలో టీడీపీ విజయం సాధించాయి. అయితే రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే తేదీగా జూన్‌ 2ను యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడంతో అప్పటి వరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చే రోజే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, ముహూర్తం పేరుతో చంద్రబాబునాయుడు తన ప్రమాణ స్వీకారాన్ని జూన్‌ 8వ తేదీకి వాయిదా వేసుకున్నాడు. ఆ కారణంగా సీమాంధ్రలో అప్పటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు జూన్‌ రెండో తేదీ ఉదయం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.