కర్నాటక మెడికల్ యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్, జూన్ 7 : నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. కర్నాటక నుంచి మెడికల్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చిన ఓ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గత రాత్రి ఒరిస్సాకు చెందిన ఓ యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థల పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.