ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు

imege-2
కార్పొరేట్‌కు దీటుగా మలుస్తాం శ్రీవైద్య, ఆరోగ్య శాఖ్య మంత్రి రాజయ్య
హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ టి.రాజయ్య అన్నారు. మానవ సేవయే మహా సేవగా భావించి తమ ప్రభుత్వం పని చేస్తుం దని తెలిపారు. వైద్య శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామన్నారు. ఉప ముఖ్యమం త్రిగా రాజయ్య శనివారం సచివాలయం డీ బ్లాక్‌లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిం చారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో పిడియాట్రిక్‌ విభాగాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తూ ఆయన తొలి సంతకం చేశారు. పిల్లల విభాగంలో 50 పడకలు ఉండగా దాన్ని 120 పడకలకు పెంచుతూ ఆయన సంతకం చేశారు. పిడి యాట్రిక్‌ విభాగాన్ని ఐసీయూగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మెదక్‌ జిల్లాలోని నంగునూర్‌ వద్ద రూ.8.80 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆ మోదం తెలుపుతూ రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని పల్లపల్లెకూ మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. గ్రామీణ
వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, నాణ్యమైన మందులు సరఫరా చేస్తామని హావిూ ఇచ్చారు. వైద్య శాఖను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఉద్యోగులంతా అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని సూచించారు. ఉద్యోగులు సమయ పాలన పాటించాలని కోరారు. త్వరలోనే ఆస్పత్రులను తనిఖీ చేస్తామన్నారు. వైద్య విద్యకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు మౌళిక వసుతులు కల్పిస్తామన్నారు. వైద్య కళాశాలల్లో సౌకర్యలు మెరుగుపరుస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. గడప గడపకు అవసరమైన మందులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.