ముంపునకు వ్యతిరేకంగా నిప్పంటుకుంటున్న పోలవరం

imege-5

ఉధృతమవుతున్న ఆదివాసీల ఆందోళనలు
ఖమ్మం, జూన్‌ 7 (జనంసాక్షి) :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ముంచేందుకు సాగుతున్న యత్నాల పై ఆదివాసీలు, తెలంగాణ ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ముంపు గ్రామాలను తెలంగాణలోనే కొనసాగించాలని ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. అటు ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్‌ఎస్‌ యత్ని స్తుండగా ఇటు క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు ¬రెత్తు తున్నాయి. పోలవరం ముంపు మండలాలను తెలంగా ణలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్ధృతమైంది. శనివా రం భద్రాచలం ముంపు ప్రాంతాల సరిహద్దు రహదా రులను అఖిలపక్షం నేతలు దిగ్బంధించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రహదారుల దిగ్బంధంతో పాటు వంటావార్పు నిర్వహించారు. ముం పు గ్రామాల ప్రజలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రహదారులపై బైఠాయించారు. భద్రాచలం గోదా వరి వంతెన వద్ద అఖిలపక్షం నేతలు ధర్నా నిర్వహించారు. ఉదయమే ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని అఖిలపక్ష నేతలు కొద్దిరోజులుగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే శనివారం రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలతో పాటు గిరిజనులు ఉదయం 8 గంటలకే రోడ్లపైకెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురయ్యే ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తలపెట్టిన రోడ్ల దిగ్బంధనంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనలు విరమించాలని అఖిలపక్షనేతలను సముదాయించారు. వారు వినకపోవడంతో రోడ్ల దిగ్బంధనాన్ని అడ్డుకొని భగ్నం చేశారు. పోలవరం ఆర్డినెన్స్‌ రద్దు చేయలని డిమాండ్‌ అఖిలపక్షం, ఆదివాసీ సంఘాలు తలపెట్టిన రహదారుల దిగ్బంధం ఉద్రిక్తంగా మారింది. ఆర్డినెన్స్‌కు నిరసనగా ఉదయం రహదారుల దిగ్బంధ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రహదారులను దిగ్బంధించాలని అఖిల పక్షం నిర్ణయించింది. అయితే పోలీసులు అక్కడకు చేరుకుని గంటలలోపే రహదారుల దిగ్బంధనాన్ని అడ్డుకుని భగ్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై మండిపడ్డారు. ముంపు గ్రామాలను ఆంధప్రదేశ్‌లో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం జిల్లా సరిహద్దులను దిగ్బంధం చేపట్టినట్టు సీపీఐ ఎం.ఎల్‌. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, తెరాస నాయకులు బేగ్‌ తెలిపారు. అఖిలపక్షం పిలుపుతో తాము తమ నిరసన చేపట్టామన్నారు. ఏడు మండలాల్లో లక్షలాది మంది ప్రజలకు తీవ్ర నష్టం వాటించే ఆర్డినెన్స్‌కు చట్టరూపం తేకుండా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టునున్నట్లు హెచ్చరించారు. పార్టీలకతీతంగా ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ, ప్రజాసంఘాలు సహకరించారని అన్నారు. ఆదివాసీల జీవనాన్ని పూర్తిగా తుడిచిపెట్టే పోలవరం డిజైన్‌ను మార్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమను అడ్డుకున్నా సమస్య సమసి పోదన్నారు.