పోలవరం జీవవైవిధ్య విధ్వంసం దీన్ని ఆపాల్సిందే

muslim

తెలంగాణ ముంపు రాజ్యాంగ విరుద్ధం

ఆదివాసీలు సర్కారుకు పట్టరా?శ్రీహైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11 (జనంసాక్షి) :

జీవవైవిధ్యానికి పెనుముప్పు తేనున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాల్సిందేనని హైదరాబాద్‌ ఎంపీ అసదు ద్దీన్‌ ఓవైసీ అన్నారు. బుద óవారం రాష్ట్రపతి ప్రణబ్‌ము ఖర్జీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసే, వేలాది ఎకరాల అభయారణ్యాన్ని ముంచేసే పోలవరం నిర్మాణం ఆపాలంటూ డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్మాణం వల్ల జీవవైవిధ్యం ధ్వంసమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. నాలుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్న సమస్యకు ఇలాగేనా పరిష్కారం చూపేందంటూ ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం వల్ల తీవ్రమైన జీవన విధ్వంసం జరుగుతున్నా కేంద్రం మొండిగా ముందుకెళ్లడం సరికాదన్నారు. ఆదివాసీలు దేశ ప్రజలు కారా? వారి సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అంటూ నిలదీశారు. కేంద్రం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. లక్షలాది మందిని, పెద్ద సంఖ్యలో అటడిని, అరుదైన జీవజాతులను సమాధి చేసే పోలవరం నిర్మాణంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ప్రజాపోరాటలకు సిద్ధమని ఆయన హెచ్చరించారు.