విక్రమాధిత్య జాతికి అకితం
శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి
స్వదేశీ పరిజ్ఞానానికి మరిన్ని పరిశోధనలు జరపండి
ప్రధాని నరేంద్రమోడీ
పనాజీ, జూన్ 14 (జనంసాక్షి) :
శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, దేశ భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ఈ రోజు దేశానికి చాలా ముఖ్య మైన రోజని అన్నారు. భారత నౌకాదళానికి విక్రమాదిత్య అతిపెద్ద శక్తి కానుందన్నారు. యుద్ధవీరుల గౌరవార్థం జాతీయ స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించారు. శని వారం దబోరీలోని నావిదళ కేంద్రాన్ని సందర్శించిన మోదీ భారత సైనిక దళాల యుద్ధసన్నద్దతను స్వయంగా తెలుసుకున్నారు. సైనిక దళాల ధైర్య సాహసాలను కొనియాడారు. దేశ భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తామని మోదీ స్పష్టం చేశారు. త్వరలో ఒకే ¬దా, ఒకే పింఛన్ విదానం అమలు చేస్తామని వెల్లడించారు. దేశ పురోగతికి పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక అవసరమని మోడీ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. భారత్ రక్షణ శాఖలో స్వయం శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. రక్షణ శాఖకు అవ సరమైన వాటిని సొంతంగా తయారుచేసుకొనే పరిస్థితికి రావాలని కోరారు. ‘రక్షణ పరికరాలను మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి?
మనం స్వయం సమృద్ధి సాధించాలి. ఇతర దేశాలకు మన రక్షణ పరికరాలను ఎందుకు ఎగుమతి చేయకూడదని’ మోడీ వ్యాఖ్యానించారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోడీ స్వదేశంలో చేసిన తొలి పర్యటన ఇదే. అంతకు ముందు మోడీ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలో ప్రయాణించారు. ఆ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించి నౌక మొత్తాన్ని పరిశీలించారు. మిగ్-29కే యుద్ధ విమానంలో కాసేపు కూర్చొని దాని మీద నుంచి అభివాదం చేశారు. 44,500 టన్నుల ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య గతేడాది భారత నావికాదళంలో చేరింది. అత్యంత శక్తివంతమైన ఈ యుద్ధనౌకను భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ భారీ నౌక పొడవు 283.5 మీటర్లు, వెడల్పు 59.8 విూటర్లు. మొత్తం 35 యుద్ధ విమానాలను ఒకేసారి మోసుకెళ్లే సామార్థ్యం దీని సొంతం. శనివారం ఉదయం గోవా చేరుకున్న ప్రధాని మోదీ దబోరీలో ఉన్న నావికాదళ కేంద్రాన్ని సందర్శించి ఇండియన్ నేవీ గౌరవందనాన్ని స్వీకరించారు. అక్కడి నుంచి అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యకు వెళ్లిన మోదీకి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అధునాతన మిగ్-29 విమానంలో కూ ర్చున్న మోదీ దాని సమర్థతను పరిశీలించారు. అనంతరం వెస్టర్న్ నావెల్ కమాండ్‌లో ఉన్న యుద్ధన ౌకల విన్యాసాలను ప్రధాని తిలకించారు. అన్ని యుద్ధ నౌకల సమర్థతను అధికారులను అడిగి తెలుసు కున్నారు. ఈ సమయంలో అరేబియా సముద్రంలో భారీ వర్షం కురవడంతో విన్యాసాలకు అంతరా యం ఏర్పడినట్లు తెలుస్తోంది. వర్షం పడిన సమయంలో ప్రధానిని అధికారులు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య లోపలికి తీసుకెళ్లారు.