ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

it

హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి)

సాఫ్ట్‌వేర్‌, హర్డ్‌వేర్‌ హబ్‌గా హైదరా బాద్‌ను తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. సాంకేతిక నగరంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెం చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబ డి ఉందని తెలిపారు. త్వర లో మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్‌ మానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. వీటి ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు రానున్నాయన్నారు. హైదరాబాద్‌లో వైఫై సేవల కోసం పలు కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతున్న ‘ఇండి యా గాడ్జెట్‌ ఎక్స్‌పో-2014’ను కేటీఆర్‌ గురువారం ప్రారం భించారు. అనంతరం ఆయన ప్రసంగిం చారు. హైదరాబాద్‌ను అన్ని విదాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలి పారు. నగరాన్ని సాంకేతిక నగరంగా మారుస్తామని చెప్పారు. ఇప్పటికే ఇన్యూబేషన్‌ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్స హిస్తామని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తామ న్నారు. ఇది కేవలం పరిశోధనలకే పరిమితం కాదని సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగాల అభివృద్ధికి కృషి చేస్తుందని, అలాగే యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో హైదరాబాద్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉందని రూ. 50 వేల కోట్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక హార్డ్‌వేర్‌ను కూడా అభివృద్ధి

చేసేందుకు యత్నిస్తామన్నారు. నగరాన్ని హర్డ్‌వేర్‌ హబ్‌గా రూపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఐటీ అభివృద్ధికి త్వరలోనే మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో హార్డ్‌వేర్‌కు సంబంధించి కొత్త పాలసీ తీసుకురానున్నట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, చిన్న కంపెనీలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రత్యేక విధానం రూపొందిస్తామని కేటీఆర్‌ వివరించారు. పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రధానమంత్రిని రాష్ట్రానికి ఆహ్వానిస్తామన్నారు.

చానెళ్ల నిలిపివేతతో సంబంధం లేదు..

రాష్ట్రంలో రెండు చానెళ్ల ప్రసారాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. చానెళ్ల ప్రసారాల నిలిపివేతను ప్రభుత్వానికి ఆపాదించొద్దని ఆయన సూచించారు. తెలంగాణ శాసనసభను, శాసనసభ్యులను కించపరిచేలా వ్యవహరించిన టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానెళ్ల ప్రసారాలను ఎంఎస్‌ఓలు, కేబుల్‌ ఆపరేటర్లు రెండ్రోజులుగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు, విూడియా సంస్థలు విమర్శలు గుప్పించాయి. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. కేబుల్‌ ఆపరేటర్ల నిర్ణయానికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. చానెళ్లు నిలిపివేయడంలో ప్రభుత్వం పాత్ర లేదని దాన్ని ప్రభుత్వానికి ఆపాదించొద్దన్నారు. కేబుల్‌ పరిశ్రమ స్వయం ప్రతిపత్తి సంస్థ అని.. దీన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. బురద జల్లే కార్యక్రమం వద్దని ఎంఎస్‌ఓలతో సదరు టీవీ చానల్స్‌ సమస్యపై చర్చించుకోవాలని సూచించారు.