హెల్త్‌ సిటీగా హైదరాబాద్‌

ktr
ఐటీతో పాటు వైద్యానికి బ్రాండ్‌ ఇమేజ్‌ శ్రీఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
హెల్త్‌ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, తెలం గాణ రాష్ట్రంలో వైద్య రంగాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని, బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య రాజధానిగా హైదరాబాద్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. శుక్రవా రం తాజ్‌కృష్ణాలో జరిగిన ‘ఇండో గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌ అండ్‌ ఎక్స్‌పో-2014’ను కేటీఆర్‌ ప్రారంభిం చారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిం చుకున్నామని కొత్త రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణా నలు మెరుగుపరచడమే లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణలో హైదరాబాద్‌లో తప్ప మిగతా ఎక్కడా కార్పొరేట్‌ వైద్యం అందుబాటులో లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వాలు ప్రజారో గ్యాన్ని నిర్లక్ష్యం చేశాయని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రభు త్వ వైద్య రంగాన్ని పట్టించుకోలేదని విమర్వించారు. బడ్జెట్‌లో కేవలం 2 శాతం మాత్రమే వైద్య రంగానికి నిధులు కేటాయించారన్నారు. కానీ తాము రాబోయే బడ ె్జట్‌లో వైద్యానికి పెద్దపీట వేస్తామన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తామని చెప్పారు. నిమ్స్‌ తరహాలో ప్రతీ జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేసా ్తమని తెలిపారు. బీబీనగర్‌ నిమ్స్‌ ఆస్పత్రిని రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ప్రజలుకు అందుబాటులోకి తెస్తా మన్నారు. ప్రతీ మండల కేంద్రంలో ఉన్న ఆరోగ్య కేం ద్రాల్లో వసతులను మెరుగుపరుస్తామని, ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలను పటిష్టం చేస్తామన్నారు. 2022 కల్లా ప్రజ లందరికీ ఆరోగ్యం అందించేలా కృషి చేస్తామన్నారు. ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌తో పాటు హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో ఆదిలాబాద్‌లో అంటువ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగానే దృష్టి సారించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య ఆదిలాబాద్‌లో
పర్యటించనున్నారని తెలిపారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. వైద్య రంగంలో పెట్టుబడిదారులను సాదరంగా ఆహ్వానిస్తామని కేటీఆర్‌ తెలిపారు. హెల్త్‌కేర్‌లో హైదరాబాద్‌లో పెట్టుబడులకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతామన్నారు. మెడికల్‌ టూరిజానికి హైదరాబాద్‌ కేంద్రమని వైద్యరంగం విస్తరణకు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫార్మసీ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. తెలంగాణలో మెడికల్‌ సీట్ల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. మెడికల్‌ సీట్లకు సంబంధించి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. వైద్య సీట్ల కోతపై అఖిల భారత వైద్యమండలి (ఎంసీఐ)తో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ఎంసీఐతో పాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారని తెలిపారు. రాష్ట్రానికి కచ్చితంగా అదనపు సీట్లు తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పెంచేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైద్యులు ఎడవెల్లి విజయేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశ్వనగరంగా హైదరాబాద్‌
హైదరాబాద్‌ మహానగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ అన్నారు. సంక్షేమ, అభివృద్ధి సమపాళ్లలో మేళవించి ముందుకు వెళ్తామన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) ప్రతినిధులతో కేటీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారుల ఆహ్వానం మేరకు ఆయన ఆస్కీని సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ విూడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. భౌగోళికంగా హైదరాబాద్‌ అన్ని విధాలా అనువైన ప్రాంతమని, అందుకే పెట్టుబడిదారులు భాగ్యనగరం వైపు చూస్తున్నారని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, దృఢ సంకల్పం ఉండి అదే సమయంలో భౌగోళికంగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనుకూలంగా ఉన్న ఈ నగరం ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు తగినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌ తెలంగాణలోని ఐదు జిల్లాలను కలుపుతూ ఏర్పడిందని.. సగం తెలంగాణ ప్రాంతం నగరంలోనే ఉందన్నారు. ప్రస్తుతమున్న రింగ్‌రోడ్డుతో పాటు మరో రింగ్‌ రోడ్డును నగరం చుట్టూ ఉన్న పట్టణాలు షాద్‌నగర్‌, భువనగిరి, గజ్వేల్‌, సంగారెడ్డి, చేవెళ్లను కలుపుతూ ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. రాబోయే పదిహేనేళ్లలో హైదరాబాద్‌ నగరం మూడింతలు విస్తరిస్తుందని.. భువనగిరి, షాద్‌నగర్‌, గజ్వేల్‌ లాంటి ప్రాంతాల వరకు నగరం విస్తరిస్తుందన్నారు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగవుతుందన్నారు. స్వరాష్ట్ర సాధనలో సుదీర్ఘ పోరాటం ఫలించిందని.. కొత్త రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని.. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. నగరాభివృద్ధి కోసం అనుభవం ఉన్న ఆస్కి లాంటి సంస్థలే కాకుండా మరే ఇతర సంస్థలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు.