శాఖల పనితీరుపై వందరోజుల ప్రణాళిక సిద్ధం చేయాలి: చంద్రబాబు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై వందరోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయా శాఖల్లోని అవినీతి అంశాలను యనమల రామకృష్ళ్ణడు నేతృత్వంలోని అవినీతి నిరోధక ఉపసంఘానికి నివేదించాలని అన్నారు. బోధనారుసుం చెల్లింపుపై న్యాయపోరాటం చేయాలని మంత్రి వర్గంలో నిర్ణయించారు. రాష్గానికి అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చంద్రబాబు తన మంత్రులకు తెలిపారు. ఇందుకు మంత్రులందరూ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.