చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఎండ తీవ్రత తగ్గుతోంది. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.