ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి
ఖమ్మం : దమ్మంపేట మండలం గండుగులపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన టిప్పర్ బైక్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.