కేసీఆర్‌ను కలిసిన సింగపూర్‌ విదేశాంగ మంత్రి

2
పెట్టుబడులకు ఆసక్తి

హైదరాబాద్‌, జులై 3 (జనంసాక్షి) :

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సింగపూర్‌ విదేశాంగ, న్యాయ శాఖల మంత్రి కె. షణ్ముగం గురువారం సచివాలయంలోని సీ బ్లాకులో కలిశారు. ముఖ్యమంత్రి ఆయన్ను సాదరంగా ఆహ్వానించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరారు. వివిధ రంగాల్లో సింగపూర్‌, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరించే విధానాలపై పరస్పరం చర్చించారు. షణ్ముగం వెంట సింగపూర్‌ హై కమిషనర్‌ లిమ్‌ థాన్‌ కౌన్‌ తదితర అధికారులు ఉన్నారు.