పోయిన ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు

హైదరాబాద్, జులై 8 : నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ మొదటి అంతస్థు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. వర్షప్రభావంతో ఏపీ సీఎం వ్యక్తిగత సిబ్బంది పనిచేసే గది పైకప్పు కూలిపోయింది. చంద్రబాబునాయుడు అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే గదిపైకప్పు కుప్పకూలింది. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో లేక్‌వ్యూకు వెళ్లాలా వద్దా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.