హఠాత్తుగా పెరిగిన బంగారం ధర

హఠాత్తుగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్: బంగారం ధర పెరిగింది. దేశ ప్రజలందరి చూపు బడ్జెట్‌ మీద, స్టాక్‌ మార్కెట్ల మీద ఉన్న సమయంలో బంగారం ధర హఠాత్తుగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ ధర 14 డాలర్లు పెరగడంతో మన దేశ మార్కెట్లో 10 గ్రాముల ధర ఒక్కసారిగా 800 రూపాయలకు పైగా పెరిగింది.

ప్రస్తుతం ఎంసిఎక్స్లో  24 క్యారెట్ల ధర 28,420కి సమీపంలో అమ్మకం జరుగుతోంది. ఔన్స్‌ ధర 1341 డాలర్లకు సమీపంలో అమ్మకం జరుగుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశం లేకపోవడంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో బంగారం ధర పెరిగినట్లుగా భావిస్తున్నారు.