నకిలీ బంగారంతో భారీగా రుణం తీసుకున్న ఉద్యోగి
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు సహకార బ్యాంక్‌లో బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్ నకిలీ బంగారం తనఖా పెట్టి రూ. 2.80 కోట్లు రుణంగా తీసుకున్నాడు. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తంచేశారు.