8న వృత్తివిద్య ప్రవేశ పరీక్ష తేదీల వెల్లడి

హైదరాబాద్‌: వృత్తి విద్య ప్రవేశ పరీక్షల  తేదీలను ఈ నెల 8న ప్రకటించనున్నారు. వివిధ పోటీ పరీక్షల తేదీలను పరగణనలోకి తీసుకొని ఈ తేదీలను ప్రకటిస్తారు. ఎంసెట్‌, ఎంసీఏ, ఎంబీఏ. పీజీఈసెట్‌, లా, వ్యాయామ విద్య ప్రవేశ తేదీల వెల్లడిపై ఈ నెల 8న ప్రత్యేక సమావేశం జరగనుంది, ఇదే సమయంలో కౌన్సెలింగ్‌. సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభ తేదీలపై నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా అఖిల భారత సాంకేతిక విద్యామండలి క్యాలెండర్‌ ఇయర్‌ను ఇప్పటికే ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ ‘ క్యాలెండర్‌ ఇయర్‌’ను ప్రకటించనుంది.