8 మంది తాలిబన్లను విడుదల చేసిన పాక్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడి జైళ్లలో ఉన్న 8 మంది తాలిబన్లను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు మాజీ అఫ్ఘాన్ మంత్రులు ఉన్నారు. అప్ఘనిస్థాన్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వీరిని విడుదల చేస్తున్నాట్లు పాక్ విదేశాంగ కార్యాలయం వెల్లడించారు. దీంతో గత నెల రోజుల నుంచి విడుదలైన తాలిబన్ల సంఖ్య 26కు చేరింది.