8 మంది ఎన్‌ఎంఆర్‌ల క్రమబద్ధీకరణ
ఖమ్మం, జూన్ 27 : ఇల్లందు పురపాలక సంఘంలో పని చేస్తున్న 8 మంది ఎన్‌ఎంఆర్‌ల సర్వీసులను క్రమబద్ధీకరణ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాజీవ్‌రంజన్‌మిత్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లందు పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న వీరయ్య, బాలయ్య, రాధాబాయి, రాములు, శ్రీరాములు, లక్ష్మయ్య, పోషంల సర్వీసులను న్యాయస్థానం ఆదేశాల మేరకు క్రమబద్ధీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.