భారీ అగ్ని ప్రమాదం వల్ల 8 ఇళ్లు దగ్ధం
ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలంలోని మురుమళ్ల గ్రామంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభివించింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 8 గృహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 16 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఆస్తి నష్టం రూ. 3లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రజలు భయాందోళనలకు గురాయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ముమ్ముడివరం చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.