జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

4

పేదలకు ఉన్నత శ్రేణి వైద్యం

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకోసం జిల్లాకు ఒక సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. నగరంలోని యశోద ఆస్పత్రిలో ట్రిపుల్‌ ఎఫ్‌ రేడియో సర్జరీ విభాగాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత తెలంగాణతో ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. మొక్కల పెంపకం ద్వారా కాలుష్య రహిత తెలంగాణాను నిర్మిస్తామని తద్వారా ప్రజలకు వ్యాధులబారిన పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు క్యాన్యర్‌ రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ చికిత్సకు నూతన టెక్నాలజీ అందుబాటులోకి రావడం హర్షనీయమని అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు.