ప్రవీణ్‌కుమార్ బదిలీకి ప్రయత్నిస్తేరాష్ట్ర వ్యాప్త ఉద్యమం
హైదరాబాద్, జూలై13 (జనంసాక్షి): దళిత విద్యా ర్థులు ఉన్నత శిఖరాలకు చేరడం జీర్ణించుకోలేని అగ్రకుల నాయకులు కుట్రపూరితంగా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ బదిలీ కి కుటిలయత్నం చేస్తున్నారని పలు దళిత సంఘాలు ఆరోపించాయి. ఈ కుట్రలు మానుకోని పక్షంలో రాష్ట్ర స్థాయిలో దళిత సంఘాలన్నీ ఏకమై ఉద్యమం చేస్తామని రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజు, దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు సతీష్‌మహాజన్, యువలోక్ జనశక్తి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాళ్ల భీమ్‌రావు తదితరులు ఆదివారం హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో బీజేఆర్ అభివృద్ధి సొసైటీా’య్రర్మన్ కొమ్మల నరేందర్,నారాయణ గురు ధర్మ ప్రచార సభ ప్రధాన కార్యదర్శి ఎస్.రాజలింగం, డా.అంబేద్కర్ ఫౌండేషన్ సభ్యులు బి.నితిన్‌రాజ్, దళిత ఆర్టిస్టుల ఫోరం నేత కిరణ్‌కుమార్, దీనశరణ్య సంస్థ ా’య్రర్మన్ చింతల సాయిబాబా, తెలంగాణ నిరుద్యోగుల ఐకాస ా’య్రర్మన్ బుస్స శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.