ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అల్లం

1

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్టు అల్లం నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇటీలవలే ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇంతవరకు ఆయన  నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్‌గా పని చేసారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు తోడురాగా ఆయన నివాళుల అర్పించిన పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. సన్నిహితులు, టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్‌ సంఘాల బాధ్యులు ఆయనకు హార్థిక శుభాకాంక్షలు తెలియచేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు, శ్రీరాం భద్రయ్య తదితరులు హాజరై ఆయనను అభినందించారు.