శాస్త్రీయ వ్యవసాయం దిశగా తెలంగాణ

3

ఇక్రిశాట్‌తో అనుసంధానం

బంగారు తెలంగాణాకు ప్రణాళికలు

హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) :

తెలంగాణాను విత్తనోత్పత్తి కేంద్రంగా, వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వ్యవసాయాన్ని శాస్త్రీయతో జోడించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ విధానానికి స్వామినాథన్‌ సిఫార్సులు స్ఫూర్తిగా తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. తాను ప్రతిపంక్షలో ఉండగా స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేశానని అన్నారు. ఇప్పుడు ఆ సిఫార్సులు అమలు చేసే అవకాశం తనకు దక్కందని కేసీఆర్‌ అన్నారు. భారతదేశ హరిత విప్లవ పీతామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ సోమవారం సచివాలయంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయ విధానంపై వారివురి మధ్య చర్చ జరిగింది. విత్తన ఉత్పత్తికి అనువైన నేలలు తెలంగాణలో ఉన్నాయని ఇందుకు తోడు ఇక్రిశాట్‌ కూడా అందుబాటులో ఉన్నందున విత్తనోత్పత్తిని ప్రొత్సహించాలని స్వామినాథన్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తనోత్పత్తి భాండగారంగా మార్చాలనుకున్నామని అన్నారు. ప్రాంతాల వారీగా నేలలను పరీక్షించి అందుకు అనుగుణంగా విత్తనాలను ఉత్పత్తి చేయానున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వామినాథన్‌కు సూచించారు. వ్యవసాయం పూర్తిగా సంప్రదాయ బద్దంగా సాగుతోందని దీనికి కొత్త పుంతలు ఏర్పాటు చేయాలని స్వామినాథన్‌ చెప్పారు. కరవు పీడిత ప్రాంతాల్లో అనుసరిచాల్సిన వ్యవసాయ పద్దతులు, ప్రత్యామ్నాయ పంటలపై ఇవురి మధ్య చర్చ జరిగింది. వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసందానం చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేసీఆర్‌ చెప్పారు. మహిళలలు వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనేల ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. స్వామినాథన్‌ పట్ల కేసీఆర్‌ గౌవరం, అభిమానాన్ని చాటుకున్నారు. 90 ఏళ్ల వయస్సుగల స్వామినాథన్‌ వ్యవసాయ రంగానికి మేలు చేయాలన్న తపన తనకు ఎంతో ఉత్సహాన్ని ఇచ్చిందని అన్నారు. ఈయన స్ఫూర్తి అందరికీ ఆదర్శ ప్రాయంగా ఉండాలని కేసీఆర్‌ అన్నారు.