రాజ్యసభలో చర్చకు విపక్షాల పట్టు
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీతావహ దాడుల ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అంతులేకుండా పోతున్న అక్కడి హింసపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో గందరగోళం ఏర్పడి సభ రెండు పర్యాయాలు వాయిదా పడింది. ఒక దశలో జేడీయూ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీని మాట్లాడాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచించారు. అయితే విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అందుకు నిరాకరించారు. ఇజ్రాయెల్-పాలస్తీనాతో మన దేశానికి ఉన్న దౌత్యపరమైన సంబంధాలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కారణంగా చర్చకు అంగీకరించలేదు.