మావోయిస్టు బహిష్కృత నేత పాండా లొంగుబాటు

2

భువనేశ్వర్‌, జూలై 18 (జనంసాక్షి) :

మావోయిస్టు బహిష్కృత నేత సవ్యసాచి పాండా పోలీసులకు లొంగిపోయారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు ఒడిశా పోలీసులు చెప్తున్నా, ముందస్తు సమాచారం ప్రకారమే ఆయన ఉన్న డెన్‌పై లీకేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను శుక్రవారం ఉదయం గంజాం జిల్లాలో పాండాను బరంపురం పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా సమాచారం. పాండాపై రూ.17 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. 2012లో మావోయిస్టు పార్టీతో విభేదాల కారణంగా బయటకు వచ్చిన పాండాను పార్టీ బహిష్కరించినట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత ఆయన అనేక కష్టాలను ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా డీజీపీ సంజీవ్‌ మాలిక్‌ వద్ద పాండా లొంగిపోయినట్లు సమాచారం. గతేడాది ఆయన భార్య కూడా పోలీసులకు లొంగిపోయిన నేపథ్యంలో పాండాది లొంగుబాటేనని స్పష్టమవుతోంది.