సైబర్‌ సెక్యూరిటీలో హైదరాబాదే సేఫ్‌

4
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) :

తెలంగాణను సైబర్‌ సెక్యూరిటీలో సేఫ్టీ స్టేట్‌గా మార్చుతామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి పునరుద్ఘాటించారు. తాజ్‌కృష్ణా ¬టల్‌లో సైబర్‌ సెక్యూరిటీపై జరిగిన సెమినార్‌లో మంత్రి ప్రసంగించారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఈ మధ్య నగరంలో సైబర్‌ నేరాలు బాగా పెరిగాయి.. సైబర్‌ నేరాలను ఆరికడుతామని ఆయన చెప్పారు. వివిధ కంపెనీలు కూడా సైబర్‌ కైమ్ర్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. మొత్తం హైదరాబాద్‌ నగరాన్ని వైఫై  నగరంగా మార్చాలనే ప్రభుత్వ పట్టుదలగా ఉందన్నారు. ఇకముందు వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు చవకధరలకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని  అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రాధాన్యత రంగాల్లో కూడా ఇది ఎంతగానో దోహదపడతాయని చెప్పారు.