ఒబామా పర్యటనలో హైదరాబాద్‌ను చేర్చండి

5
సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) :

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటనలో హైదరాబాద్‌నూ చేర్చాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ను అమెరికా వాణిజ్యశాఖ సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ సచివాలయంలోని సీ బ్లాక్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో భారత పర్యటనకు ఒబామా విచ్చేస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనలో హైదారబాద్‌నూ చేర్చాలని కోరారు. అలాగే ఇండో-అమెరికా సదస్సు నిర్వహణపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ భూకంప ప్రమాద రహిత ప్రాంతమని, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమమైనది చెప్పారు. వైమానిక, రక్షణ రంగాల్లో పెట్టుబడికి అమెరికా ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారని సీఎం తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌ కాన్సులేట్‌ కార్యాలయాన్ని నిర్మిస్తామని అరుణ్‌కుమార్‌ చెప్పారని కేసీఆర్‌ అన్నారు.