కేబినెట్‌ నిర్ణయాలు భేష్‌

3

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కితాబు

హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి) :

మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వం ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. ఉద్యమంలో ఇచ్చిన హామీ మేరకు సిఎం కెసిఆర్‌ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం గతంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే క్రమంలో కేబినేట నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెల్లువెత్తిన ప్రజాకాంక్షకు ప్రభుత్వం ప్రతిరూపం ఇచ్చిందని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం నిర్వహించిన తెలంగాణ జేఏసీ కోర్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ముందు విద్యార్థుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. నిరుద్యోగుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పోలవరంపై తమ పోరాటం ఆగదని కోదండరామ్‌ స్పష్టం చేశారు.