మీ పిల్లల ఫీజులు మీరు.. మా పిల్లల ఫీజులు కడతామంటే తప్పా?

4

హైదరాబాద్‌పై ఆంధ్రోళ్ల పెత్తనం సహించం

పోలవరం అంటేనే గిరిజనులను ముంచుడు : హోం మంత్రి నాయిని

హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఫీజులు తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని, ఏపీ విద్యార్థుల ఫీజులు మీరే చెల్లించుకోవాలని చెప్తే తప్పేంటని ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి నిలదీశారు. హైదరాబాద్‌పై అధికారాలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌, పోలవరం ముంపు ప్రాంతాల విలీనం తదితర అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను లాక్కోవాలని కేంద్రం చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. హైదరాబాద్‌పై ఉన్న పోలీసు అధికారాలను గవర్నర్‌కు కట్టబెట్టాలని ఢిల్లీలో సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి వెంకయ్య నాయుడి చెవిలో తెలంగాణపై కుట్రలు వివరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అధికారాలను లాక్కుంటే ఉద్యమం చేస్తామని నాయిని హెచ్చరించారు. దీనిని ఎట్టి పరిస్తితుల్లోనూ అంగీకరించమన్నారు. తమది ప్రజా బలంతో ఏర్పడిన ప్రభుత్వమని, ప్రజాబలంతోనే కేంద్ర వైఖరిని ఎండగడతామన్నారు. గవర్నర్‌ చేతికి అధికారులు ఇస్తే ఊరుకోమని స్పష్టం చేశారు.

మా పిల్లలకు మేమే చెల్లిస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీమాంధ్ర నేతలు నానాయాగీ చేస్తున్నారని నాయిని నర్సింహరెడ్డి విమర్శించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల పిల్లల ఫీజులను ఆ రాష్ట్రమే చెల్లించాలని స్పష్టం చేశారు. మా పిల్లల బాగోగులను మేం చూసుకుంటాం, విూ పిల్లల బాగోగులు మీరు చూసుకోండి అని అన్నారు. లక్షన్నర కోట్లతో రాజధానిని కట్టుకునే వారు పిల్లల ఫీజులు కట్టుకోలేరా? అని నిలదీశారు. కేసీఆర్‌ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆంధ్రా మంత్రులు విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు తన మంత్రులను సరి చేసుకోవాలని, కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు. మేం నిర్ణయాలు తీసుకుంటే, మా కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుంటే సీమాంధ్ర మంత్రులకు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. 1969 ఉద్యమంలో చనిపోయిన వారిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావిూలన్నీ తూచా తప్పక అమలు చేస్తామని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచించడం తమ కర్తవ్యమని తెలంగాణ నాయిని  వ్యాఖ్యానించారు. ఫీజుల చెల్లింపు విషయంలో కేసీఆర్‌ను తిట్టడం అన్యామని ఆయన అన్నారు. మీ పిల్లల ఫీజులు కట్టుకోవడం విూకేం కష్టం? అంటూ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. లక్షన్నర కోట్లతో రాజధాని కట్టుకునే వాళ్లు పిల్లలకు ఫీజులు కట్టుకోలేరా అంటూ ప్రశ్నించారు. చట్టానికి, నిబంధనలకు లోబడే మేం నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల ఫీజుల చెల్లింపు బాధ్యత తమదే అని తెలిపారు.  తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఏపీ నేతలు రెచ్చగొట్టే పనులు చేయొద్దన్నారు. హైదరాబాద్‌లోన విద్యా సంస్థల్లో ఉమ్మడి విద్య అని అన్నా విభజన చట్టానికి కూడా ఒప్పుకున్నామని, మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దన్నారు. మాది ఉద్యమపార్టీ మళ్లీ ఉద్యమం చేయడానికి వెనుకాడమన్నారు. ఇప్పుడు మేం రాజకీయపార్టీగా ఆవిర్భవించాం. ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. సీమాంధ్ర మంత్రులు, సీఎం చంద్రబాబు తరచూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని నాయిని హితవు పలికారు. కేసీఆర్‌ను విమర్శించడం సరికదన్నారు. సీఎం చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోరారు. చట్టాలనికి నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 1956 నుంచి తెలంగాణ సంపదను అనేక రకాలుగా దోచుకున్నారని మండిపడ్డారు. తిరిగి మళ్లీ పెత్తనానికి కుట్ర చేస్తే ఊరుకోమన్నారు.

గిరిజనులను ముంచేందుకే పోలవరం

గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన పొరపాట్లనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ¬ం మంత్రి నాయిని నర్సింహరెడ్డి విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో ప్రధాని మోడీ వైఖరి సరికాదన్నారు. లక్షలాది గిరిజనులను ముంచడం కేంద్రానికి తగదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావిూలను తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. పోలవరం అంశంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్దామని మమ్మల్ని ఎవరూ కోరలేదని వెల్లడించారు. ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో ప్రధాన మంత్రి మోడీ వైఖరి సరికాదని అన్నారు. లక్షలాది గిరిజనులను ముంచడం కేంద్రానికి తగదని అన్నారు. అప్పట్లో యూపీఏ చేసిన పొరపాటునే ఇప్పుడు భాజపా ప్రభుత్వం చేస్తోందని వ్యాఖ్యానించారు. ముంపు మండలాలు ఏపీలో కలపడాన్ని తెలంగాణలో తెదేపా నేతలు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బలహీన వర్గాల వారి ఇళ్లను క్రమబద్దీకరించాలని తాము సీఎంను కోరామని వెల్లడించారు. పేదల కట్టడాలను ఎక్కడా కూల్చలేదన్నారు. విశ్వనగరంగా చేసేందుకే ఈ ప్రయత్నమని అన్నారు. బియాస్‌ ఘటన మృతుల కుటుంబాలకు మేం పరిహారం చెల్లించామని తెలిపారు. అక్కడి ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలవరంపై అఖిలపక్షం వెళ్దామంటే ఎవరూ రాలేదని ఆయన చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఏపీ నేతలు స్వస్తి పలకాలన్నారు. గిరిజనుల అభివృద్ధి బీజేపీకి పట్టదా అని నాయిని ప్రశ్నించారు. జైరాం రమేష్‌ చేసిన పొరపాటే బీజేపీ చేసిందని విమర్శించారు.

కంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ సబబే

కంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలనుకోవడాన్ని మంత్రి సమర్థించారు. ఎన్నోఏళ్లుగా వారు వెట్టి చేస్తున్నారని అన్నారు. వారిని క్రమబద్దీకరిస్తామని గతంలోనేచెప్పామని అన్నారు. దీనివల్ల ఇతర నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. దీనిని అర్థంచేసుకోవానల్నారు. టీచర్లు, లెక్చరర్లు, డాకటళర్లు కూడా కాంట్రాక్ట్‌లో పనిచేయడం న్యాయం కాదన్నారు. వారుకూడా తెలంగాణ బిడ్డలేనన్నారు. ఇది మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయమన్నారు.

నాయినిని కలిసిన ఓయూ విద్యార్థులు

ఉస్మానియా వర్సిటీలో శుక్రవారం పోలీసులు తమపై లాఠీచార్జీ చేశారని విద్యార్థులు ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డికి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల బృందం మంత్రిని కలిసి నిన్న వర్సిటీలో జరిగిన బీభత్సాన్ని వివరించారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న తమపై పోలీసులు అకారణంగా లాఠీలు ఝళిపించారని విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగాల గురించి కూడా విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని ఉద్యోగాలను అందరికి వచ్చేలా సృష్టిస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెట్టిచాకిరి కింద భావించే ప్రభుత్వం వాళ్ల ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తుందని తెలిపారు. దీనిపై విద్యార్థుల్లో ఎలాంటి ఆందోళనలు అవసరంలేదన్నారు. అందరూ ఉద్యమాలు చేయకుండా ఉద్యోగాల కోసం చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతీ ఒక్కరికి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.