పెట్టుబడులకు హైదరాబాదే అనువు
ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ
చైనాలో ఇండస్టీరియల్ పార్కును డెవలప్ చేస్తాం
బిర్లా కంపెనీ ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం
హైదరాబాద్, జూలై 19 (జనంసాక్షి) :
పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని, ఇండ్రస్టీ ఫ్రెండ్లీ పాలసీని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణాలో పారిశ్రామిక, వైద్యరంగంలో సేవలు అందించేందుకు బిర్లా కంపెనీ ప్రతినిధులతో శనివారం సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని ఆ కంపెనీ అభిప్రాయపడింది. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కంపెనీ ఎండీ దీపక్ కేత్ర, సి.కె.బర్లా కలుసుకున్నారు. హైదరాబాద్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీలను విస్తరించే ఆలోచన ఉందని, అలాగే వైద్యరంగంలో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అలాగే వైద్య, విద్యారంగంలో కూడా తమ సేవలను విస్తరించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి కె.చందశ్రేఖరరావు చెప్పారు. ఇక్కడి ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీని తీసుకువచ్చామని అన్నారు. పరిశ్రమలకోసం అనుకూలంగా ఉన్న దాదాపు రెండున్నర లక్షల ఎకరాల భూమిని టీఎస్‌ఐఐసీ ఇస్తామని, పూర్తిగా అన్ని అనుమతులు ప్రభుత్వం చొరవ తీసుకుని మంజూరు మంజూరు చేస్తుందన్నారు. ఇందుకోసం దేశంలోనే అత్యుత్తమైన సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడతామని, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రెండు, మూడు వారాల్లోనే అనుమతులు ఇస్తామన్నారు. చైనా మాదిరిగా ఇండస్ట్రియల్ పార్కును డెవలప్ చేస్తామన్నారు. అవినీతిరహితమైన విధానాన్ని అవలంబిస్తామని, పారిశ్రామిక అనుమతుల విషయంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు సరళమైన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇందుకోసం చట్టం కూడా తెస్తామన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన పారిశ్రామిక విధానంపట్ల బిర్లా కంపెనీ అమితాశక్తిని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణవైపు చూస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ఇండస్ట్రీయల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.