బ్లాక్‌మనీపై చర్చిద్దాం రండి

5

పూర్తిగా సహకరిస్తాం

స్విస్‌ ఖాతాలపై భారత్‌ యూబీఎస్‌ ఆహ్వానం

దాచి డబ్బులో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ

ఫేక్‌లో రూపాయిది మూడో స్థానం

న్యూఢిల్లీ/బెర్న్‌, జూలై 20 (జనంసాక్షి) :

బ్లాక్‌మనీపై చర్చించడానికి రావాలంటూ స్విస్‌ బ్యాంకు అధికారులు భారత అధికారులను ఆహ్వానించారు. విదేశీ బ్యాంకుల్లో దాచిన బ్లాక్‌ మనీని వెనక్కి రప్పిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు అధికారులు స్విస్‌ బ్యాంకు ఖాతాల వివరాల కోసం యూబీఎస్‌ అధికారులను సంప్రదించారు. తమ దేశంలో డబ్బులు దాచిన నల్ల కుభేరుల వివరాలను అందజేస్తామని స్విట్జర్లాండ్‌ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతీయులు దాచిన బ్లాక్‌ మనీ వివరాలు అందించడానికి తాము సుముఖంగా ఉన్నట్లు యూబీఎస్‌ అధికారులు ప్రకటించారు. బ్లాక్‌ మనీ దాచిన వాళ్ల పేర్లతో కూడిన జాబితాను ఫ్రాన్స్‌, జర్మనీలాంటి దేశాల ద్వారా భారత్‌ సేకరిస్తోంది. అయితే జాబితాలోని పేర్లను వెల్లడించేందుకు యూబీఎస్‌ అధికారులు అంగీకరించడం లేదు. భారత ప్రభుత్వం రాసిన లేఖ మేరకు తమ దేశం ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని, అలాగే భారత్‌ నుంచి ఒక బృందాన్ని ఆహ్వానిస్తున్నామని స్విస్‌ ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. మరోవైపు స్విస్‌ బ్యాంకుల్లో దాచిన బ్లాక్‌మనీలో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ ఉన్నట్లు తెలిసింది. యూబీఎస్‌ అధికారులు నకిలీ కరెన్సీని నోట్లలో యూరో, అమెరికా డాలర్‌ తర్వాత భారత రూపాయి మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. స్విస్‌ ఫెడరల్‌ ఆఫ్‌ పోలీసు (ఫెడ్‌పోల్‌) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం.. 2013లో స్వాధీనం చేసుకున్న నకిలీ యూరో నోట్లు 2,394, అమెరికా డాలర్‌ నోట్లు 1,101 ఉండగా భారత రూపాయి నోట్లు 403 ఉన్నాయి. ఇందులో రూ.500 విలువైన నోట్లు 380, వెయ్యి రూపాయల నోట్లు 23 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2012లో 2,624 నకిలీ రూపాయి నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏడాది నకిలీ జాబితాలో అమెరికా డాలర్‌ తర్వాత భారత రూపాయి రెండో స్థానంలో ఉంది.