పొంగిపొర్లుతున్న చీకుపల్లి వాగు

ఖమ్మం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని చీకుపల్లి వాగు పొంగిపొర్లుతోంది. భారీ వర్షం కారణంగా వాజేడు మండలం చీకుపల్లి వంతెనపైకి వరదనీరు వచ్చి చేరింది. వంతెనపై వరదనీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.