సుబ్రతారాయ్‌కు మళ్లీ చుక్కెదురు

1

పెరోల్‌ ఇచ్చేందుకూ సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ (జనంసాక్షి): చిన్న మదుపర్ల నుంచి సేకరించిన రూ.23వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులను తిరిగి వారికి చెల్లించాలన్న ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సహరా గ్రూప్‌ సిఎండి సుబ్రతా రాయ్‌కు మరోసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మంగళవారం ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కక్షిదారులు, ఆస్తుల కొనుగోలు దారులతో సంప్రదింపులు జరిపేందుకైనా పెరోల్‌ ఇవ్వాలన్న సుబ్రతా రాయ్‌ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మదుపర్ల బకాయిల చెల్లింపు కోసం న్యూయార్క్‌, లండన్‌ నగరాల్లో గల గ్రూప్‌ ¬టళ్ల విక్రయం, తాకట్టు ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని సుబ్రతా రాయ్‌ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించింది. సుబ్రతా రాయ్‌ ఆస్తుల విక్రయం, తదితర అంశాలపై ఎవరితోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చలు జరుపుకోవచ్చునని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. పోలీసు కస్టడీలో ఉంటూనే కక్షిదారులతో ఎవరితో?నా చర్చించవచ్చునని సుప్రీం తెలిపింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ సుబ్రతారాయ్‌ తన సంప్రదింపులు జరుపుకోవచ్చునని న్యాయస్థానం పేర్కొంది.