తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియామీర్జా

3

రూ.కోటి నజరాన ప్రకటించిన కెసిఆర్‌

క్రీడారంగానికి పూర్తి సహాయం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌ (జనంసాక్షి): ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను టి. బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంగళవారం సానియాకు ధృవపత్రం అందచేశారు. మంగళవారం పారిశ్రామికవేత్తలతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ సానియా నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. కెసిఆర్‌ ఆమెకు రూ.కోటి చెక్కును అందచేశారు. అమెరికా ఓపెన్‌ టెన్నిస్‌ చాంపియన్‌ షిప్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ కోసం ఆమెకు కెసిఆర్‌ ఈ వితరణ ప్రకటించారు. ఇకపై ఆమె తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల పురోభివృద్ధి, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాల విశేషాలను జాతీయంగా, అంతర్జాతీయంగా  ప్రచారం కల్పిస్తారు. సానియాను చూసి తెలంగాణ గర్విస్తోందని కెసిఆర్‌ ప్రశంసించారు. ప్రస్తుతం మహిళల డబుల్స్‌ ర్యాంకుల్లో ఐదో స్థానంలో ఉన్న ఆమె అంతర్జాతీయ ర్యాంకుల్లో నెంబర్‌ వన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. సానియా స్వస్థలం హైదరాబాద్‌ కావడం మనందరికీ గర్వకారణమన్నారు.