జాతీయ సేయిలింగ్‌లో గౌరీ అగర్వాల్‌కు కాంస్యం
హైదరాబాద్: అండర్ 16 బాలికల జాతీయ స్థాయి సేయిలింగ్ పోటీల్లో గౌరీ అగర్వాల్‌ను కాంస్యం వరించింది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఆమె జాతీయ సేయిలింగ్ ఛాంపియన్, భారత అంతర్జాతీయ రెగెట్టా సేయిలింగ్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆమెకు అత్యంత తక్కువ కాలంలో సేయిలింగ్‌లో ప్రావీణ్యత సాధించినందుకుగాను బెస్ట్ నోవీస్ సేయిలర్‌గా ట్రోఫీ అందజేశారు. గౌరీ అగర్వాల్ తండ్రి సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్.