ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలు

1

అందరికీ ఆప్షన్లు

స్థానికత ఆధారంగా విభజన

విధివిధానాలు విడుదల చేసిన కమల్‌నాథన్‌ కమిటీ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :

ఉద్యోగుల పంపిణీకి కమల్‌నాథన్‌ కమిటీ మార్గదర్శకాలు వెల్లడి చేసింది. వీటిపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతతకు తెరపడింది. రాష్ట్ర స్థాయి క్యాడర్‌ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు ఖరారయ్యాయి. పది రోజుల పాటు ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ చేయాలని కమల్‌నాథన్‌ కమిటీ నిర్ణయించింది. ఆప్షన్ల విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అందరికీ ఆప్షన్లు ఇవ్వనున్నట్లు కమిటీ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను వెబ్‌సైట్లో పెట్టింది. ఒకసారి ఇచ్చిన ఆప్షన్‌ను మార్చుకొనే అవకాశం ఉద్యోగులకు ఉండదు. భార్యాభర్తలకు, ఒంటరి మహిళలకు ఆప్షన్లలో ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒకటి, రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారికి ఆప్షన్లు ఇవ్వకూడదని ప్రతిపాదించింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమల్‌నాథన్‌ కమిటీ శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ¬ం శాఖ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఐవైఆర్‌ కృష్ణారావు కూడా హాజరయ్యారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన విధివిధానాల ఖరారుపై చర్చించారు. తుది చర్చల అనంతరం చివరకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఉద్యోగుల పంపిణీపై విధివిధానలను కమలనాథన్‌ కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచింది. విధివిధానాలపై అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో తెలపాలని సూచించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది మార్గదర్శకాలు ఖరారు చేయనున్నట్లు తెలిపింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ ఉంటుందని కమిటీ స్పష్టం చేసింది. స్థానికతపై ఇటీవల వివాదం నెలకొన్న నేపథ్యంలో 371 డీ ప్రకారమే స్థానికతను నిర్ధారించనున్నట్లు తేల్చి చెప్పింది. ఏడేళ్ల విద్యాభ్యాసం ఆధారంగానే స్థానికత నిర్ధారించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 371 డీ నిబంధన మేరకే స్థానికతనను నిర్ధారిస్తామని పేర్కొంది. ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. భార్యాభర్తలకు, ఒంటరి మహిళలకు ఆప్షన్లలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వానున్నట్లు తెలిపింది. ఒంటరి మహిళలు అంటే వివాహం కాని వారికి, వితంతువులు అని కమిటీ పేర్కొంది. ఒకటి రెండు సంవత్సరాల్లో రిటైర్‌ అవుతున్న వారికి ఆప్షన్లు ఉండవని ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందని తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ, పలు వివరాలు వెల్లడించారు. స్థానికతపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. 371 డీ ప్రకారం స్థానికతను నిర్ధారించాలని, దీని ప్రకారమే విభజన చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారన్నారు.